Home » Election Commission of India
ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికార వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెట్ ఉప ఎన్నిక నామినేషన్లపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్(CEO Vikasraj) మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. నేడు(గురువారం) నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయని.. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. నామినేషన్ ఫామ్, అఫిడవిట్లో అన్ని వివరాలను పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం తాళం వేసింది. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేవాళ్లు కావడంతో.. వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమందికి బిగ్ షాక్ తగిలినట్లైంది.
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha Elections 2024) హాడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి నుంచే (ఏప్రిల్ 19న) మొదలు కానుంది. ఈ క్రమంలో ఓటరు జాబితా(voter list)లో మీ పేరును ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
దేవాదాయ, ధర్మదాయ శాఖ ఉద్యోగస్తులని ఎన్నికల విధుల్లో పాల్గొనేలా ప్రణాళికలు చేస్తున్నారని బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు (Suryanarayana Raju) అన్నారు. వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ (Election Commission) చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల సంఘం పలుమార్లు చెప్పినా కొంతమంది ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) అన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కలిసి పలు ఫిర్యాదులు అందజేశారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.
బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై 'అభ్యంతరకర' వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాపై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలంటే సెంట్రల్ బలగాలతో ఏపీలో ఎన్నికలు జరిపించాలని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. మంగళవారం నాడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan)కు దెబ్బ తగలటం శాంతిభద్రతల లోపమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలోనూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సభల్లోనూ లా అండ్ ఆర్డర్ లోపం కనిపించిందన్నారు.