TS Lok shabha Elections : పూరి గుడిసెనే.. పోలింగ్ స్టేషన్
ABN , Publish Date - May 14 , 2024 | 04:15 AM
ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
దోమలపెంట, మే 13 : ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
గుడిసెలో ఓ మంచం వేసి.. దానిపై ఈవీఎం, వీవీ ప్యాట్‌ను పెట్టారు. వెలుతురుకు ఇబ్బంది లేకుండా గుడిసె చూరుకు టార్చ్‌లైట్ కట్టి.. ఆ వెలుతురు ఈవీఎంపై పడేలా చేశారు. గిరిజన పెంటల్లో భవనాలు లేకపోవడంతో అధికారులు ఇలా ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.