AP Election Polling 2024:పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
ABN , Publish Date - May 13 , 2024 | 07:04 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 6.00 గంటల కల్లా క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 6.00 గంటల కల్లా క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
AP Elections: ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ ఏజెంట్లపై దాడులు..?
ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే నిర్ణీత సమయానికల్లా క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాయంత్రం 4.00 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5.00 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని వివరించారు.
ఆ నియోజకవర్గాల్లో క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఇతర నియోజకవర్గాల్లో సాయంత్రం 6.00 గంటలకల్లా క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఎంతో చురుకుగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం నెలకొన్నా, అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నా, వర్షాలు పడినా.. లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 71 లక్షలకు పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుషులు ఉండగా, 1.40 కోట్లకు పైగా మహిళలు ఉన్నట్లు తేలింది. పురుషులతో పోలిస్తే.. మహిళలే ఈ పోలింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారు.
AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News