AP Elections: ఎన్నికల నిబంధనలకు నరసరావుపేట వైసీపీ అభ్యర్థి బ్రేక్
ABN , Publish Date - May 13 , 2024 | 12:14 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నిబంధనలను తుంగలో తొక్కుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదంటే కార్యకర్తలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు.
నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నిబంధనలను తుంగలో తొక్కుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదంటే కార్యకర్తలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు.
ఎన్నికల నిబంధనల మేరకు అసెంబ్లీ లేదంటే పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థి ఒక వాహనంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాత్రం 10 కార్లతో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. శ్రీనివాస రెడ్డి వెంట దాదాపు వంద మంది అనుచరులు ఉన్నారు. గోపిరెడ్డి నిబంధనలు బ్రేక్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే
AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన
Read Latest AP News And Telugu News