Home » Eluru
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. పర్యటన వివరాలను జనసేన పార్టీ వెల్లడించింది. రేపటినుంచి వారాహి యాత్ర ప్రారంభంకానుంది. జూలై 9 (ఆదివారం)న ఏలూరులో జరిగే బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభమవుతోంది.
ఏలూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేగింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా ముఠా కిడ్నీ రాకెట్ నడుపుతోంది. బాధితుల వద్ద నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 7 ఏడు లక్షల వరకు కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు.
రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం తరలిస్తున్న ముఠాను కైకలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా విదేశీ, స్వదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏలూరు జిల్లాలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. బత్తులవారిగూడెంలో బహిరంగలో మాజీమంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) ప్రసంగిస్తుండగా సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడప గండం తప్పేట్టులేదు. మరోసారి ఎమ్మెల్యేల గడప ప్రోగ్రెస్‌పై తాజాగా సీఎం జగన్ సమీక్షించారు. గడప గడపకు వెళ్లమని పదే పదే ఆదేశించినా రాష్ట్రంలోని మరో 18 మంది మైనస్‌లో ఉన్నారని తేల్చారు. అయితే వారెవరో పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్ మిగిల్చారు.
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) విమర్శించారు. దెందులూరులో యాసిడి దాడి మృతురాలు ఫ్రాన్సికా మృతదేహాన్ని సందర్శించి చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికా కూతురిని
ఏలూరు యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి చెందింది. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఎడ్ల ఫ్రాన్సినా మృతి చెందింది. నిన్న ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. గత రాత్రి ఫ్రాన్సినా మృతి చెందింది. ఈ నెల 13వ తేదీ రాత్రి స్కూటీపై వస్తున్న ఫ్రాన్సినాపై కొందరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
జగనన్న నవరత్నాలను దోచుకుంటూ పట్టుబడ్డ నలుగురు ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. నూజివీడు మండలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికి ఇళ్ళు పధకంలో భారీ స్కామ్‌కు పాల్పడిన నలుగురు గృహనిర్మాణశాఖ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెం వద్ద టీడీపీ నేతలు జలదీక్షకు దిగారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. మంగళవారం ఉదయం పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు.