Home » Employees
దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్వాడీ ఎంప్లాయిస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లాడ్లా భాయ్ యోజన’ అనే పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణతో పాటు స్టైపెండ్‌ను అందించనుంది.
అమరావతి: జీపీఎస్ అమలు తేదీని సూచిస్తూ వచ్చిన ఉత్తర్వులు, గెజిట్ నోటిపికేషన్‌ను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. తనకు తెలసిన వెంటనే దాన్ని నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాకే బదిలీల ప్రకియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కల్పనపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....
ఇంజనీరింగ్ విద్య పూర్తవుతున్న సమయంలోనే విద్యార్థులకు ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాల పేరిట కొలువులు ఇస్తుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వేతన ప్యాకేజీలూ భారీగా ఉంటాయి. అలాంటి ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి.
గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. ఆ కారణంగానే పదోన్నతులు, బదిలీల వ్యవహారం శాఖలో కొలిక్కి రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా వ్యవసాయ అనుబంధ శాఖల్లోని పలు విభాగాల ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందకుండా పోయాయి. ఇంకా అనేక శాఖల్లోని క్షేత్రస్థాయి, దిగువ శ్రేణి చిరుద్యోగులకు చిన్న మొత్తాల్లో ఇవ్వాల్సిన జీతాలను....