Share News

Employee Transfers: గత సర్కారు వల్లే ఉద్యోగులకు చిక్కులు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:19 AM

గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. ఆ కారణంగానే పదోన్నతులు, బదిలీల వ్యవహారం శాఖలో కొలిక్కి రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Employee Transfers: గత సర్కారు వల్లే ఉద్యోగులకు చిక్కులు..

  • ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగులతో మంత్రి కోమటిరెడ్డి

గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. ఆ కారణంగానే పదోన్నతులు, బదిలీల వ్యవహారం శాఖలో కొలిక్కి రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఉద్యోగ సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. శాఖలో చేపట్టాల్సిన పని అయినా, సమస్యల పరిష్కారం కోసమైనా కలిసి పనిచేద్దామని అన్నారు.


శాఖలోని సర్వీస్‌ రూల్స్‌, సీనియారిటీ జాబితా, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన సమస్యలపై ఉద్యోగులంతా ఏకాభిప్రాయానికి వస్తే త్వరితగతిన పరిష్కారమవుతాయని సూచించారు. ఇక నుంచి కలిసికట్టుగా కష్టపడి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలు, కలెక్టరేట్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేద్దామని అన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 03:19 AM