Employment Issues: పదోన్నతుల కల్పించాకే బదిలీలు చేపట్టాలి..
ABN , Publish Date - Jul 14 , 2024 | 05:11 AM
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాకే బదిలీల ప్రకియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా డిమాండ్ చేశారు.
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్
హైదరాబాద్ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాకే బదిలీల ప్రకియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఉద్యోగుల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ఏడాది మార్చి నుంచి పదవీ విరమణలు ప్రారంభమవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్ ఖైరతాబాద్ మింట్‌కాంపౌండ్ 1104 ప్రధాన కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సన్మానసభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, నేతలు సుధీర్, వరప్రసాద్ తదితరులు మల్లు రవిని సన్మానించారు. అనంతరం సంఘం నేతలు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని.. సర్కారు స్పందించపోతే ఆందోళనలు చేపడతామన్నారు. మల్లు రవి మాట్లాడుతూ సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు.