Home » Etela rajender
నిర్మల్ జిల్లా: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ (Congress) విజయకేతనం ఎగరేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) పరిస్థితులు మారిపోయాయ్..! మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ రాగా.. బీజేపీ బొక్కబోర్లా పడిపోయింది.! బీఆర్ఎస్తో (BRS) ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి అసలు బీజేపీ స్థానం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చింది..
జిల్లాలోని జమ్మికుంట, ఇళ్ళందకుంట మండలాల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు.
సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా బీజేపీ నాయకురాలు విజయశాంతి వరుస ట్వీట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయశాంతి వ్యవహారం వాత పెట్టి.. వెన్న పూసిన మాదిరిగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను ఉద్దేశించే విజయశాంతి ట్వీట్స్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) విమర్శలు గుప్పించారు
హనుమకొండ: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెగించే వరకూ విశ్రమించబోమని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ (Telangana) ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
అవును.. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చాలా రోజుల తర్వాత సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రధాని మోదీ వరంగల్ సభలో (Modi Warangal Sabha) బండి మాట్లాడినా మునుపటిలా జోష్‌గా మాట్లాడలేదు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలవటంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై జాతీయ నాయకత్వం సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి ఈటల వెళ్లారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) నివాసానికి బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) వెళ్లారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు.. కార్పొరేటర్ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. తనపై హైకమాండ్ విధించిన సస్పెన్షన్‌పై ఈటలతో రాజాసింగ్ చర్చించారు. సస్పెన్షన్ ఎత్తివేసేలా అధిష్టానాన్ని కోరతానని రాజసింగ్‌కు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.