TS Politics : స్పీడ్ పెంచిన కమలం.. బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీలు రెడీ.. మాజీ మంత్రితో చర్చలు!

ABN , First Publish Date - 2023-07-30T10:02:13+05:30 IST

కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ (Congress) విజయకేతనం ఎగరేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) పరిస్థితులు మారిపోయాయ్..! మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ రాగా.. బీజేపీ బొక్కబోర్లా పడిపోయింది.! బీఆర్ఎస్‌తో (BRS) ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి అసలు బీజేపీ స్థానం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చింది..

TS Politics : స్పీడ్ పెంచిన కమలం.. బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీలు రెడీ.. మాజీ మంత్రితో చర్చలు!

కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ (Congress) విజయకేతనం ఎగరేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) పరిస్థితులు మారిపోయాయ్..! మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ రాగా.. బీజేపీ బొక్కబోర్లా పడిపోయింది.! బీఆర్ఎస్‌తో (BRS) ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి అసలు బీజేపీ స్థానం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చింది. దీనికి తోడు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించడంతో బీజేపీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురైనట్లేనని సొంత పార్టీ నేతలే చెప్పుకున్నారు. అయితే.. ఒక్కసారిగా కమలం స్పీడ్ పెంచింది. చేరికలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీజేపీలో నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితుల్లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. చేర్చుకునే పనిలో కమలనాథులు బిజీ అయిపోయారు.


bjp.jpg

క్యూ కడుతున్నట్లేనా..?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి (Kishan Reddy) చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మాజీలు, సీనియర్ నేతలు, సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకునేందుకు గాను వరుసగా చర్చలు జరుపుతున్నారు. శనివారం నాడు పలువురు మాజీలను ఢిల్లీ వేదికగా కాషాయ కండువా కప్పించిన కమలనాథులు.. మరికొందరు క్యూలో ఉన్నారు. సినీ నటి జయసుధ (Actress JayaSudha) కూడా బీజేపీ కండువా కప్పుకుంటారని.. ఆమెను సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలు బీజేపీ ఉందని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం నాడు మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సొత్తు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ఇద్దరితో మాజీ ఎంపీ వివేక్ సంప్రదింపులు జరిపారు. సంజీవరావు 1983లో చెన్నూరు నుంచి అప్పటి రాష్ట్రీయ సంజయ్‌ విచార మంచ్‌ (మేనకా గాంధీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో అప్పటి ప్రభుత్వం రద్దు కావడంతో రెండేళ్లకే పదవిని కోల్పోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. అమరాజుల శ్రీదేవి 2004లో బెల్లంపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రె‌స్‌లో చేరారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరితో పాటు మరో 10మంది మాజీలు బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారని.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కమలనాథులు చెబుతున్నారు. అయితే త్వరలోనే ఎవరెవరు బీజేపీలో చేరతారనే దానిపై జాబితా రిలీజ్ చేస్తామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Krishna-Yadav.jpg

కాషాయ గూటికి మాజీమంత్రి..!

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణాయాదవ్ (Krishna Yadav) బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాదే చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. కృష్ణాతో చర్చలు జరిపినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేరిక వాయిదా పడుతూ వస్తోంది. దీంతో తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరపడంతో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే.. అంబర్‌పేట లేదా మలక్‌పేట నుంచి టికెట్ ఇవ్వాలని కృష్ణాయాదవ్ హామీ అడుగుతున్నారట. పూర్వ హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ నుంచి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే.. మారిన రాజకీయ పరిణామాలతో 2016లో టీడీపీకి టాటా చెప్పి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. సీనియార్టీ, ఇంత పలుకుబడి ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గత కొన్నిరోజులుగా పార్టీ మారాలని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు యాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. ఈటల మంతనాలు జరిపిన తర్వాతే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. కాగా.. నకిలీ స్టాంపుల కుంభకోణంలో కృష్ణాయాదవ్‌ హస్తముందని తేలడంతో 2003లో అరెస్టై మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ కేసు నుంచి బయటపడటంతో మళ్ళీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావాలని కృష్ణాయాదవ్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి ఆహ్వానం రావడం.. టికెట్‌పై హామీ వస్తే కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ ఉన్నారట. మొత్తానికి చూస్తే.. బీజేపీకి పాతరోజులు మళ్లీ వస్తున్నాయని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి


AP Politics : ఆట మొదలైంది.. చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఆగస్టు-01 నుంచి..!


Telangana Rains : తెలంగాణను వదలనంటున్న వానలు.. మళ్లీ భారీ వర్షాలు.. సోమవారం కూడా సెలవు..!?


TS Politics : కృష్ణయ్యకు కాంగ్రెస్ కీలక హామీ.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా.. ఇప్పుడిదే చర్చ..!?


Jaya SudhaBJP : జయసుధకు కాషాయ కండువా కప్పి.. ఆ ఇద్దరికీ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి ప్లాన్.. రచ్చ.. రచ్చ!


Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?


YSRCP Vs TDP : వైఎస్ జగన్‌కు ఝలక్.. మాజీ మంత్రి నారాయణ ఇంటిబాట పడుతున్న వైసీపీ నేతలు


Updated Date - 2023-07-30T10:10:09+05:30 IST