TS Politcs : బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన కమలనాథులు!

ABN , First Publish Date - 2023-07-21T16:22:07+05:30 IST

అవును.. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చాలా రోజుల తర్వాత సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రధాని మోదీ వరంగల్ సభలో (Modi Warangal Sabha) బండి మాట్లాడినా మునుపటిలా జోష్‌గా మాట్లాడలేదు..

TS Politcs : బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన కమలనాథులు!

అవును.. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చాలా రోజుల తర్వాత సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రధాని మోదీ వరంగల్ సభలో (Modi Warangal Sabha) బండి మాట్లాడినా మునుపటిలా జోష్‌గా మాట్లాడలేదు. అయితే.. శుక్రవారం నాడు కిషన్ రెడ్డి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించగా.. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో కార్యక్రమానికి విచ్చేసిన కమలనాథులు, బీజేపీ కార్యకర్తలు, వీరాభిమానులు సైతం నోరెళ్లబెట్టిన పరిస్థితి. ఇంతకీ సంజయ్ అంతగా ఏం మాట్లాడారు..? ఎవర్ని ఉద్దేశించి మాట్లాడారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..


Bandi-Sanjay-2.jpg

ఇదీ అసలు సంగతి..!

తన మీద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారని బండి చెప్పుకొచ్చారు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలిని చురకలు అంటించారు. కొందరు ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న సంతృప్తి తనకుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సహరించిన కార్యకర్తలు, నేతలకు ఈ సభావేదికగా బండి ధన్యవాదాలు తెలిపారు. అంతటితో ఆగని సంజయ్.. ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను (Etela Rajender) పరోక్షంగా కామెంట్స్ చేశారు. పత్రికల్లో ఉండే వాళ్ళు ప్రజల్లో ఉండలేరని సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా (Social Media), వార్తా పత్రికల్లో ఉండటం కాదు.. ప్రజల్లో ఉండాలని ఒకింత హితవు పలికారు. మునుగోడులో (Munugodu) కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Komati Reddy Rajagopal Reddy) పైసలు పంచలేదని.. ఆయన దగ్గర లేవన్నారు. అయితే.. కొందరు నేతలు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. బీజేపీలో బండి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రకాశ్ జవాడేకర్ (prakash javadekar), మురళీధర్ రావు (Muralidhar Rao), తరుణ్ చుగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక, ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. బండి ప్రసంగం విన్న ఈ నేతలు నోరెళ్లబెట్టారు.

Bandi-Sanjay.jpg

ఈ మాటల వెనుక..?

వాస్తవానికి.. ఈ మధ్య ఈటల-బండి వర్గానికి అస్సలు పడట్లేదు. ఇరు వర్గీయులు పార్టీ ఆఫీసులోనే కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న ఈటల ఈ సభావేదికగా గట్టిగానే చురకలు అంటించారని బండి వర్గీయులు చెప్పుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గురించి ఈ మధ్యే హైదరాబాద్, ఢిల్లీ వేదికగా ఎమ్మెల్యే రఘునందన రావు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సభావేదికగా రఘునందన్‌కు కూడా గట్టిగానే ఇచ్చిపడేశారని బండి వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బండి కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి.

Bandi-and-Komati.jpg

అరెరే పెద్ద చిక్కొచ్చి పడిందే!

మరోవైపు.. ఇదే సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపి రెండు ఒక్కటి కాదని చెప్పేందుకు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాజగోపాల్ తీవ్ర వాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ (CM KCR) ఈడీని (ED) మేనేజ్ చేశారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఈడీ అమ్ముడుపోయిందని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. అయితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కోమటిరెడ్డి ఇలా మాట్లాడారేంటి..? అని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారట. బీజేపీ- బీఆర్ఎస్ (BJP-BRS) మధ్య స్నేహం లేదంటూనే.. బీజేపీని కోమటిరెడ్డి మరింత ఇరకాటంలో నెట్టారని సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

Jawadekar-and-Murali.jpg

మొత్తానికి చూస్తే.. కిషన్ రెడ్డి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బండి, కోమటిరెడ్డి చెప్పాల్సింది చెప్పేశారు.!. ఇప్పుడు ఈ ఇద్దరు చేసిన కామెంట్సే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెగ చర్చనీయాంశం అవుతున్నాయి. అసలే పార్టీలో అలకలు, అసంతృప్తులు, ఎవరు ఎప్పుడు బీజేపీకి బై బై చెబుతారో తెలియని పరిస్థితులున్నాయ్. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఇలా ఉన్నట్టుండి కామెంట్స్ చేయడంతో రచ్చ రచ్చ అవుతున్నాయి. ఈ ఇద్దరి కామెంట్స్‌పై రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో. చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


TS Politics : గజ్వేల్‌కు గులాబీ బాస్ గుడ్ బై చెప్పేస్తున్నారా.. పరిశీలనలో రెండు నియోజకవర్గాలు.. ఆ సర్వే తర్వాత మారిన సీన్..!?


Rains lash Telangana : ఐటీ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి..


TS Rains : భారీ వర్షాలతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటు సెలవులు..


Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?


Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?


Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!


TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!


BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్‌’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్


Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?



Updated Date - 2023-07-21T16:35:10+05:30 IST