Etala: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెగించే వరకూ విశ్రమించబోము..
ABN , First Publish Date - 2023-07-24T14:22:22+05:30 IST
హనుమకొండ: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెగించే వరకూ విశ్రమించబోమని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
హనుమకొండ: కేసీఆర్ ప్రభుత్వాన్ని (KCR Govt.) గద్దెగించే వరకూ విశ్రమించబోమని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆయన హనమకొండలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ పథకాలపేరుతో ఖర్చుచేసే డబ్బు కేవలం రూ. 25 కోట్లు మాత్రమేనని, మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రూ. 45 వేల కోట్లు వస్తోందన్నారు. పేదలకు మద్యం తాగించి వచ్చే డబ్బులు కూడా వారి కోసం ఖర్చు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. యువతను నిర్వీర్యం చేస్తున్న చరిత్ర కేసీఆర్‌దేనని అన్నారు.
బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పింఛన్ ఇస్తామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతుబంధు సంపన్నులకు అవసరం లేదని, బీజేపీ అధికారంలోకి వస్తే సంపన్నులకు రైతుబంధు, రైతు బీమా కట్ చేస్తామని, పేదల పైసలకు కాలవాదారుగా ఉంటామని స్పష్టం చేశారు.
కర్ణాటక (Karnataka) ఎన్నికల తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందన్న వార్తల్లో నిజం లేదని, ఓ వర్గం మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ బీజేపీ దశల వారీగా ఆందోళన చేస్తుందన్నారు. ఇళ్లులేని పేదలు ఎన్నో అవస్థలు పడుతున్నారని కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం హామీని నెరవేర్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.