Home » Farmers
తాము సాగు భూములకు పట్టాలు ఇప్పించాలని సంబంధిత రైతులు సబ్ కలెక్టర్ అపూర్వ భరతకు వినతిపత్రం అందిం చారు. సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం తనిఖీకి వచ్చిన సబ్‌కలెక్టర్‌ను గురువారం మండల పరిధిలోని నడింపల్లికి చెందిన పలువురు రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తాము 45ఏళ్లుగా నడింపల్లిలో సాగు చేసుకుంటున్న భూములకు పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ పథకాలు అందడంలేదన్నారు.
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.
మండలంలోని రైతులు సాగుచేసిన మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జాన్సన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న సోమవారం మండల కేంద్రంలో పర్యటించి మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంటను కత్తెర పురుగును ఆశించడంతో దాని నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మొక్కజొన్న సాగుచేసిన తరువా త తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పంటకు వాడాల్సిన మందులను ఆయన వివరించారు.
మండలకేంద్రమైన రొద్దం సమీపంలో పెన్నానదిలో నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. తమ భూములు కోతలకు గురవుతాయని వంతెన నిర్మాణం ఎత్తు పెంచాలని నది చుట్టుపక్కల పొలాలున్న రైతులు డిమాం డ్ చేశారు. రొద్దం సమీపంలో పెన్నానది ప్రవహించడంతో కొన్నేళ్లుగా రొద్దం నుంచి కుర్లపల్లి, కనుమర, నారనాగేపల్లి గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
రైతుబీమా పథకంలో కొత్త రైతుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని, పథకంలో లేని వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి శనివారం సర్క్యులర్ జారీచేశారు.
రుణమాఫీ పథకంలో తొలి జాబితాలో పేర్లులేని రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించే బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)కు అప్పగించారు.
రుణమాఫీపై రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని, రూ.2లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష లోపు రుణమాఫీపై క్షేత్ర స్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి.. మాఫీ సొమ్ము ఖాతాలో పడనివారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు.