Home » Farmers
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు..
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
PM Kisan Scheme: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Crop Loan Waiver: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది.
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
పండుగల సమయంలో ఆఫర్లు.. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్లు, బ్యాంకు లోన్లు, ఉద్యోగావకాశాలు.. ఇతర సమయాల్లో ట్రాఫిక్ చలాన్లు..!
రైతు రుణ మాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని... భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
రుణమాఫీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. రెండు లక్షల రుణమాఫీ చేయటానికి మొత్తం రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలివిడతలో లక్ష వరకు మాఫీ చేయటానికి రూ. 6,100 కోట్లు ఖర్చు చేశారు.