PM Kisan Scheme: 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:10 AM
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం. రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని 2019లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం. ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.6 వేలు నేరుగా జమ చేస్తోంది.

హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం రైతుల (Farmers)కు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) ఒకటి.ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6వేల చొప్పున అందుకుంటున్నారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అంటే రూ.2వేల చొప్పున కేంద్రం అందిస్తోంది.ఇప్పటి వరకు 19వ విడత డబ్బులు అందుకున్న రైతులు.. ఇప్పుడు 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎవరు అర్హులు.. తదితర వివరాలు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం. రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని 2019లో ప్రధాని మోదీ ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం. ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.6 వేలు నేరుగా జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ. 2వేల చొప్పున 3 వాయిదాలలో విడుదల చేస్తోంది. ప్రతి విడతలో ఇచ్చే రూ. 2వేల ద్వారా ప్రభుత్వం చిన్న, ఆర్థికంగా బలహీనమైన రైతులకు సాయం అందిస్తోంది. ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం మొత్తం 19 విడతల పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులను పంపిణీ చేసింది. అయితే పథయం ప్రయోజనాలను పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
Also Read..: ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
రైతుల ఆధార్ ఈకేవైసీ (EKYC) చేసుకోవాలి..
పీఎం కిసాన్ యోజన అనేది మోదీ ప్రభుత్వం పేద రైతుల సంక్షేమం కోసం అందించే ప్రభుత్వ పథకం. అర్హులైన రైతులు ఆధార్ కార్డును తమ బ్యాంకు ఖాతాకు లింక్ (EKYC) చేసుకోవాలి. యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం చాలా ముఖ్యం. అలాగే భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనది. ఈసారి 20వ విడత డబ్బులు జూన్ నెలలో విడుదల అయ్యే అవకాశముంది. అయితే అధికారికంగా తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఈ పథకం 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న పేద రైతులకు మాత్రమే వర్తిస్తుంది. తప్పనిసరిగా EKYC ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. భూమి రికార్డులను వెరిఫై చేయించుకోవాలి.
ఒకే కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు..
పీఎం కిసాన్ పథకానికి అర్హత అన్న రైతులు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. ఒక రైతు కుటుంబంలోని ఒక్కరు మాత్రమే అర్హులు. భర్త లేదా భార్య ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌లో పేరు ఉన్న వ్యక్తి ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఒకే కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యులు దరఖాస్తులు చేసుకుంటే అవి తిరస్కరించబడతాయి. ఈ పథకం రైతు కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందగలరని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.
జాబితాలో మీ పేరు ఎలా తెసుకోవాలంటే..
ముందుగా (pmkisan.gov.in) అధికారిక పీఎం కిసాన్ యోజన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయాలి.. ‘Beneficiary Status’పై క్లిక్ చేయాలి. మీ పీఎం కిసాన్ అకౌంట్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.. మీ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకపోతే.. రిజిస్టర్ చేసి మీ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. తర్వాత ‘Get Data’పై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్‌పై మీ అకౌంట్ స్టేటస్ చూడొచ్చు.
9న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి 18 వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదాను ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను తొలగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హేమంతరావు, పశ్య పద్మ కోరారు. రైతుల డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 9న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని, ఈ కార్యక్రమంలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News