Home » Gaddam Prasad Kumar
శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు.
సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం రాత్రి తెలిపారు.
‘‘దైవ దర్శనం కోసం తిరుమల కొండపైకి వెళ్లే తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే విజ్ఞప్తి పత్రాలను టీటీడీ ఆమోదించాలి.
ఆదివాసీ, గిరిజన జాతులను అభివృద్ధి పథంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
మంత్రి సీతక్కపై శాసనసభ ప్రాంగణం, హాలులో వీడియోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. వీడియోలు మార్ఫింగ్ చేయడం ఎంతో దుర్మార్గమైన, సిగ్గులేని చర్య అని అన్నారు.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.
బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ బర్కత్‌పురలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ ఎండీ నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ నివాసంలో బక్రీద్ వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.