Share News

Hyderabad: గద్దర్‌కు మరణం లేదు.. ప్రజల హృదయాల్లోనే ఉన్నారు

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:14 AM

ప్రజల హృదయాలలో ఉన్న గద్దర్‌(Gaddar) పాట, మాట అవసరమైనప్పుడు తుపాకీ తూటా అయి పేలుతుందని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌(Vennela Gaddar) అన్నారు. గద్దర్‌ జీవితం అంతా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడని అన్నారు.

Hyderabad: గద్దర్‌కు మరణం లేదు.. ప్రజల హృదయాల్లోనే ఉన్నారు

- తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌

హైదరాబాద్: ప్రజల హృదయాలలో ఉన్న గద్దర్‌(Gaddar) పాట, మాట అవసరమైనప్పుడు తుపాకీ తూటా అయి పేలుతుందని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌(Vennela Gaddar) అన్నారు. గద్దర్‌ జీవితం అంతా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడని అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో గద్దర్‌ అభిమానుల సంఘం ప్రతినిధులు సీఎల్‌ యాదగిరి, నిమ్మ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రజాయుద్థ నౌక గద్దర్‌ సాగుతున్న ప్రజా పాటల సభ నిర్వహించారు.

ఈ వార్తరె కూడా చదవండి: Nirmala Sitharaman Saree: బడ్జెట్ 2025.. ఈసారి నిర్మలా సీతారామన్ ఏ చీర ధరించారంటే..


ఈ సందర్భంగా గద్దర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడమే కాక 78వ జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెన్నెల గద్దర్‌ మాట్లాడుతూ, గద్దర్‌ యుగ పురుషుడని, ఆయన జీవితాన్ని రాస్తే అది ఒక మహాగ్రంథం అవుతుందని అన్నారు. గద్దర్‌కు మరణం లేదని, ఆయన ప్రజల హృదయాలలో ఉన్నాడని అన్నారు. అణచివేత, దోపిడీపై గద్దర్‌ పాడిన పాటలు తిరుగుబాటు గేయంగా చిరకాలం ఉంటాయన్నారు.


city10.2.jpg

గద్దర్‌ జీవిత కాలం అంతా ఆడపిల్లలకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ సభ్యురాలు బాలలక్ష్మి, నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కల్చరల్‌ సెల్‌ అధ్యక్షుడు చక్రాల రవి, దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు గంట మల్లేష్‌, గాయకులు డాక్టర్‌ మాష్టార్జీ, నేర్నాల కిషోర్‌, లెల్లె సురేష్‌, వరంగల్‌ రవి, నల్లమల్ల యాదగిరి, బుద్దిస్ట్‌ హరినాథ్‌, వివిథ సంఘాల నేతలు రాజలింగం, జి.శంకర్‌, ఐలయ్య, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Budget 2025 Live: బడ్జెట్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం

ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 11:14 AM