Hyderabad: గద్దర్ వ్యక్తి కాదు.. సమూహ శక్తి.. ఆయన్ను విమర్శిస్తే సహించేది లేదు
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:14 PM
గద్దర్(Gaddar) ఒక వ్యక్తి కాదు సమూహశక్తి అని ఆయనను విమర్శిస్తే సహించేది లేదని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్‌యాదగిరి, ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డిలు అన్నారు.

- టీయూజేఏసీ
హైదరాబాద్: గద్దర్(Gaddar) ఒక వ్యక్తి కాదు సమూహశక్తి అని ఆయనను విమర్శిస్తే సహించేది లేదని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్‌యాదగిరి, ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డిలు అన్నారు. బుధవారం చిక్కడపల్లి(Chikkadapalli) తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో గద్దర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి, ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ సంగ్రామభేరి, వేలాది ప్రజలను మేల్కొల్పిన అంబేడ్కర్ వాది, అడవి బిడ్డలు, కార్మిక, కర్షక వర్గాలు, బడుగు, బలహీనవర్గాల కోసం పోరాడిన గద్దర్ లాంటి మహనీయులకు పద్మ అవార్డు చాలా చిన్నదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Water Bill: నెల నల్లా.. వెయ్యికి పైగానే
నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాలతో మూఢనమ్మకాలతో దేశాన్ని పాలించాలనిచూస్తున్నారని మండిపడ్డారు. దళితులను, ఆదివాసీలను అణిచివేయాలని చూస్తున్నారని అందులో భాగంగానే గద్దర్‌కు పద్మ అవార్డు తిరస్కరించారని మండిపడ్డారు. రాజ్యాంగపరిధిలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పద్మ అవార్డులు వీరికివ్వాలని తీర్మానం చేసి కొన్ని పేర్లు కేంద్రానికి పంపిస్తే దళితులను, గద్దర్, గోరటివెంకన్న, అందెశ్రీ, గిరిజనులకై జీవితం ధారబోసిన జయధీర్ తిరుమలరావులకు అవార్డులు తిరస్కరించారన్నారు.
బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యాడు. ఆయన ఏ పోరాటాలూ చేయలేదని ఎవరి బతుకులు కూడా మార్చలేదని ఆయనకు ఉన్న అర్హత ఒక్క నోటి దూల మాత్రమేనని కేంద్రప్రభుత్వం వెంటనే బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు గంటి చంద్రుడు, జగన్, చంద్రన్నప్రసాద్, సురే్‌షబాబు, రాజయ్య, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ లలితకళల సమగ్రస్వరూపం
గద్దర్ లలితకళల సమగ్రస్వరూపం అని వెంకటేశ్వరయూనివర్శిటీ పూర్వ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో బుధవారం ఎందరో మహానుభావుల మధురస్మృతుల పరంపరలో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఇనాక్ మాట్లాడుతూ గద్దర్ పాట రాసి నాట్యం చేస్తూ పాడే తీరు శిల్పంలా ఉంటుందన్నారు. మానవీయ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రేమతత్వం ఆయనలో ఉందన్నారు.
తాను అనంతపురంలో కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉన్న సమయంలో గద్దర్ రచనలను పాఠ్యాంశాలుగా బోధించానని గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన జనార్దనమూర్తి మాట్లాడుతూ గద్దర్ గానసభకు పలుమార్లు వచ్చారని ఆయన పాటలో ఉత్తేజం పాటలో ఆప్యాయత వ్యక్తం అవుతాయన్నారు. కాంగ్రెస్ నేత ఉప్పల శ్రీనివా్‌సగుప్తా మాట్లాడుతూ హృదయాన్ని తాకేలా గద్దర్ పాటరాస్తారని పాడుతారన్నారు. సంఘసేవకులు భవానిశ్రీనివాస్, సుధాకర్, ప్రభాకర్, వెంకటేష్, రామ్‌రెడ్డి మాట్లాడుతూ గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వబోమని ప్రకటిండాన్ని ఖండిస్తూ మాట్లాడారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News