Home » Ganesh Chaturthi
గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఖైరతాబాద్(Khairatabad) గణపతి అంటే ఆ క్రేజే వేరు. నగర దారులన్నీ అటు వైపే అన్నట్లు 11 రోజులపాటు అక్కడి పరిసరాలు జనసంద్రంగా మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి అనేకమంది లంబోధరుడి దర్శనం కోసం తరలివస్తుంటారు.
Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.
Ganesh Chaturthi 2024: తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం మహాగణపతి స్వరూపం నమూనాను విడుల చేశారు.
సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్(Khairatabad0 మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్లో 'దిల్ సే' స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
పుట్టపర్తిలో వినాయక నిమజ్జన మహోత్సవం (Vinayaka Nimajjana Mahotsavam) కనుల పండుగగా జరిగింది. పుట్టపర్తి (Puttaparthi) పట్టణంలో గణనాథులను ఊరేగించారు.