Ganesh Immersion: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. అసలేమైందంటే..

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:41 PM

ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్యాంక్ బండ్‌పై హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం...

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్యాంక్ బండ్‌పై హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన బ్యారికెట్లను భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించారు. సాయంత్రం వరకు ప్రభుత్వమే బారికెడ్లను తొలగించకపోతే.. సాయంత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ట్యాంక్ బద్దకు భారీగా చేరుకుంటున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వీహెచ్‌పీ నేతలు.

Updated at - Sep 15 , 2024 | 12:41 PM