Share News

CP CV Anand: నిమజ్జనానికి 25వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్..

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:54 PM

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad)లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు.

CP CV Anand: నిమజ్జనానికి 25వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్..

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad)లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు. 25వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గణేశ్ పండగ సందర్భంగా నగరవ్యాప్తంగా భారీఎత్తున స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. చిన్నపెద్ద విగ్రహాలు కలిపి మెుత్తం లక్షల్లో ఉండే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఘర్షణలు, ప్రాణనష్టం, ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. సిటీ నుంచి 15వేల మంది సిబ్బంది, బయట నుంచి మరో 10వేల ఫోర్స్ రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 16, 17తేదీల్లో పెద్దఎత్తున నిమజ్జనాలు ఉండడంతో.. ఈ రెండు తేదీల్లో సుమారు 40గంటలపాటు 25వేల మంది పోలీసులు నగరాన్ని పహారా కాస్తారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ ఆనంద్ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

Hyderabad: వామ్మో జ్వరం.. పెరుగుతున్న వైరల్‌ ఫీవర్ల బాధితులు

Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

Updated Date - Sep 14 , 2024 | 03:54 PM