Hyderabad: పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్..
ABN , Publish Date - Sep 14 , 2024 | 12:07 PM
నిమజ్జనానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఖైరతాబాద్(Khairatabad) గణపతి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ఉత్సవాల 7వ రోజైన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్: నిమజ్జనానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఖైరతాబాద్(Khairatabad) గణపతి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ఉత్సవాల 7వ రోజైన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. మెట్రోరైలు, ఎంఎంటీఎస్ రైళ్ల(Metro Rail and MMTS trains) ద్వారా వందలాది మంది ప్రయాణికులు ఖైరతాబాద్ గణపతి మార్గాల్లో వస్తుండగా వీధులన్నీ జనాలతో సందడిగా మారాయి. మరోవైపు చిరు వ్యాపారాలు చేసుకునేవారితో రోడ్లన్నీ ఇరుకుగా మారాయి.
రద్దీ కారణంగా పోలీసుల సూచనలు..
- విపరీతమైన రద్దీ కారణంగా శుక్రవారం నుంచే భక్తులు, స్థానికులు గణపతి పైకి ఎక్కకుండా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాము.
- శని, ఆది వారాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలు ఉండవు. ఈరోజుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు రాకుండా జాగ్రత్తలు వహించాలి.
- భక్తులు సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారా రావాలి.
- 16వ తేదీన భక్తులు రావద్దు... ఇబ్బందులు పడొద్డు. ఆరోజున దర్శనం ఉండదు.
- భారీ గణపతిని క్రేన్ నంబరు 4 లేదా 5 వద్ద నిమజ్జనం చేయనున్నాం.
- మంగళవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్రను ప్రారంభించి మధ్యాహ్నంలోపు నిమజ్జనం చేస్తాం.
- దాదాపు 500 మంది పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఖైరతాబాద్ భారీ గణపతి గ్రంథాలయ చౌరస్తా, ఖైరతాబాద్ పెద్ద మసీదు, సెన్సేషన్ సినిమా థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్‌బాల్ మినార్, పాత సచివాలయ గేటు, తెలుగుతల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గం మీదేగా క్రేన్ నంబరు 4కు చేరుకుంటుంది.
ఆర్. సంజయ్‌కుమార్, ఏసీపీ, ఖైరతాబాద్ గణేశ్ ఇన్‌చార్జి అధికారి
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News