Home » Ganesh Nimajjanam
గణేశుడి నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ నలుమూలల నుంచి వస్తున్న వినాయకులతో రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
ట్యాంక్ బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సీఎం సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు.
Telangana: రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్‌లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులను ఆదేశించారు.
Telangana: మొదటిసారి వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. 360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు.
Telangana: హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు రూ.15 లక్షల వరకు శ్యామ్ లడ్డు వేలం పాట పాడారు.
Telangana:ఖైరతాబాద్ వద్ద గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.
భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. పోలీసుల ఆంక్షలను గమనిస్తూ నిమజ్జనాలకు వినాయక ప్రతిమలను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు 17,18వ తేదీల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గణేష్ నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రూట్ ఎంట్రీ, భారీ అతిభారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
గణనాథుల ‘నిమజ్జనం’పై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావు లేదని బెట్టు చేసిన ట్యాంక్‌బండ్ ఎట్టకేలకు గణపతులకు స్వాగతం పలికింది.