Share News

CP Anand: భక్తులకు సీపీ ఆనంద్ విజ్ఞప్తి.. ఏ విషయంలో అంటే..

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:58 AM

Telangana: భక్తులకు సీపీ సీవీ ఆనంద్ ఓ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇస్తోందని.. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందన్నారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు... సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోందన్నారు.

CP Anand: భక్తులకు సీపీ ఆనంద్ విజ్ఞప్తి.. ఏ విషయంలో అంటే..
CP CV Anand

హైదరాబాద్, సెప్టెంబర్ 18: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ వద్ద వేలాది వినాయకులు బారులు తీరాయి. ఈరోజు మధ్యాహ్నానికి నిమజ్జనాలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరోవైపు గణేష్ నిమజ్జనాలు ఆలస్యం అవుతుండటంతో స్వయంగా సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) రంగంలోకి దిగారు. గణనాథులను నిమజ్జనాలకు త్వరతగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

AP News: సీఎం చంద్రబాబుకు వరద బాధితుల కృతజ్ఞతలు


ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఓ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇస్తోందని.. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందన్నారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు... సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోందన్నారు. వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలని కోరారు. 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలిరావాలని కోరుతున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Chennai: నీలగిరుల్లో అడవి ఏనుగుల సంచారం..



ప్రణాళిక ప్రకారమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

లక్ష విగ్రహాలు హుసేన్ సాగర్ లో నిమజ్జనం అయ్యాయి అని అంచనా వేస్తున్నామన్నారు. ఇంకా వెయ్యి విగ్రహాల వరకు నిమజ్జనం కోసం ఉన్నాయని.. త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. బందోబస్తు పరంగా పూర్తి స్థాయిలో ఉందని.. ట్రాఫిక్ విడుదల చేస్తున్నామని చెప్పారు.10:30 గంటల నుంచి అన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ రిలీజ్ చేశామన్నారు. గత ఏడాది కన్నా ముందే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామని.. దాదాపుగా అన్ని ఫ్లై ఓవర్‌లు వదిలేశామన్నారు. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి ఉదయం 6:30 గంటలకు మొదలయి మధ్యాహ్నం 1:30 గంటలకు నిమజ్జనం పూర్తి అయ్యిందని.. ఇందుకు సహకరించిన ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. తమ టీం లా అండ్ ఆర్డర్ అధికారులు చాలా బాగా కృషి చేశారన్నారు. సౌత్ వెస్ట్‌లో కొన్ని మండపాల నిర్వాహకులు ఇంకా ముందుకు రాలేదని... వారు అర్దం చేసుకోవాలన్నారు. నిన్న సెలవు ప్రకటించి నిమజ్జనం చేసుకున్నామని.. కానీ కొందరు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సహకరించాలని కోరారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వరద బాధితులకు ప్యాకేజీ.. వివరాలు ఇవే..


వారందరికీ అభినందనలు...
హుస్సేన్ సాగర్‌లో 5500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని.. ఇవన్నీ రికార్డులో ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చాయని తెలిపారు. అవి దాదాపుగా 15 వేల వరకు ఉంటాయన్నారు. 15-20 అడుగుల విగ్రహాలు కొన్ని పలు ప్రాంతాల్లో ఆగిపోయాయన్నారు. అబిడ్స్‌లో అలాగే కొన్ని ప్రాంతాల్లో టస్కర్‌లు, వాహనాల కండిషన్ బాగోలేక ఆగిపోయాయని తెలిపారు. లేకపోతే ఇంకా త్వరగా నిమజ్జనం పూర్తి అయ్యేవన్నారు. తమ లా అండ్ ఆర్డర్... మిగితా పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ, మిగితా అన్ని విభాగాల అధికారులు అందరూ 40 గంటలకు పైగా పని చేస్తున్నారని తెలిపారు. వారందరికీ అభినందనలు తెలియజేశారు. చిక్కడపల్లి, ఈస్ట్ జోన్‌లో కొన్ని సమస్యలు వచ్చాయని.. తాగి గొడవలయ్యాయని తెలిపారు. మొత్తం 10 రోజుల్లో హుస్సేన్ సాగర్ లేక్‌లో లక్ష విగ్రహాలు నిమజ్జనం అయ్యాయయని చెప్పారు.


ఇవి కూడా చదవండి

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్‌డేట్.. మరికొద్దిసేపట్లో..

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 12:06 PM