Home » GHMC
కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా కార్పొరేటర్లకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, మరో ఇద్దరు కార్పొరేటర్లు కలిశారు.
త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తాను తిరిగి కార్పొరేటర్‌గా పోటీ చేయడం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) స్పష్టం చేశారు. ‘మేయర్‌గా, నగర ప్రథమ పౌరురాలిగా ఎంతో విజయవంతంగా పని చేశాననే సంతృప్తితో ఉన్నాను.
Mayor Gadwal Vijayalakshmi: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు తన గురించి తెలుసునని చెప్పారు. అక్రమంగా ఆస్తి సంపాదించాల్సిన అవసరం, ఖర్మా తనకు లేదని అన్నారు.
గ్రేటర్ పరిధిలో గత ఆరు నెలల్లో 74 హోం బర్త్ (ఇళ్లలో ప్రసవం జరిగినట్టు) సర్టిఫికెట్లు జారీ కావడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Elambaridi) స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసు విచారణకు ఆదేశించారు.
కేబీఆర్ పార్క్‌కు కూతవేటు దూరంలో.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో నిర్మిస్తున్న భవనం కథ ఇది!! నందగిరి హిల్స్ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో జి.అమరేందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన నెట్ నెట్ వెంచర్స్ సంస్థ 4.748 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
‘కొత్త ప్రభుత్వమని సమస్యల పరిష్కారానికి ఏడాది గడువిచ్చాం.. సమయం ముగిసింది.. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తాం..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్(Former Minister and MLA Talasani Srinivas Yadav) అన్నారు.
BRS: గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు.
GHMC Mayor: బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచి.. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం అధిష్టించిన గద్వాల్ విజయలక్ష్మీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు.. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్(Jawaharnagar Corporation) పరిధిలోని సర్వే నంబర్ 704, 706లో గతంలో క్రీడామైదానానికి కేటాయించిన 5 ఎకరాల భూమిని రక్షించాలని కోరుతూ అడిషన్ కలెక్టర్‌కు జవహర్‌నగర్ బీజేపీ(Jawaharnagar BJP) నాయకులు వినతి పత్రం అందజేశారు.
జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు కృషిచేయాలని ఆలిండియా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్(MP Dr. K. Lakshman) సూచించారు.