Talasani: సమయం ముగిసింది.. ఇక సమరమే
ABN , Publish Date - Jan 24 , 2025 | 06:53 AM
‘కొత్త ప్రభుత్వమని సమస్యల పరిష్కారానికి ఏడాది గడువిచ్చాం.. సమయం ముగిసింది.. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తాం..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్(Former Minister and MLA Talasani Srinivas Yadav) అన్నారు.

- అధికారులు మా నంబర్లను బ్లాక్ చేస్తున్నారు..
- మేయర్‌పై అవిశ్వాసంపై శనివారం నిర్ణయం: తలసాని
హైదరాబాద్ సిటీ: ‘కొత్త ప్రభుత్వమని సమస్యల పరిష్కారానికి ఏడాది గడువిచ్చాం.. సమయం ముగిసింది.. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తాం..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్(Former Minister and MLA Talasani Srinivas Yadav) అన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి, గ్రేటర్‌లోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి గురువారం ఆయన గ్రేటర్ కమిషనర్ ఇలంబరిదితో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వార్తను కూడా చదవండి: ప్రగతి చక్రం, పనిఒత్తిడి భారం
అనంతరం తలసాని విలేకరులతో మాట్లాడుతూ.. కొందరు అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, వారి నంబర్లు సైతం బ్లాక్ చేస్తున్నారన్నారు. ఆరు నెలలుగా వీధి దీపాల నిర్వహణ గాడి తప్పిందని, ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, రోజురోజుకు తీవ్రమవుతోన్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరామన్నారు.
మొదటిసారి కనుక విజ్ఞప్తి చేశామని, మున్ముందు ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు చేశామని, కొన్నాళ్లుగా ఆయా ప్రాజెక్టులకు జోన్ల వారీగా నిధుల కేటాయింపు తగ్గిందని ఆరోపించారు. ముసారాంబాగ్(Musarambagh) వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు.
దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, తమ హయాంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని చెబుతుండడం విచారకరమని, పౌర సరఫరాల శాఖ వద్ద సమాచారం తీసుకొని మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఇచ్చిన ప్రశ్నలను కౌన్సిల్‌లో చర్చ నిమిత్తం ఎంపిక చేయాలని అన్నారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టే విషయంలో శనివారం మరోసారి సమావేశమైన నిర్ణయం తీసుకుంటామని తలసాని చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?
ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!
Read Latest Telangana News and National News