Share News

Lakshman: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కృషిచేయాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 10:23 AM

జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం నూతనంగా ఎన్నికైన డివిజన్‌ అధ్యక్షులు కృషిచేయాలని ఆలిండియా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌(MP Dr. K. Lakshman) సూచించారు.

Lakshman: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కృషిచేయాలి

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం నూతనంగా ఎన్నికైన డివిజన్‌ అధ్యక్షులు కృషిచేయాలని ఆలిండియా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌(MP Dr. K. Lakshman) సూచించారు. గురువారం నూతనంగా ఎన్నికైన కవాడిగూడ, గాంధీనగర్‌, అడిక్‌మెట్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షులు సలంద్రి దిలీప్‏యాదవ్‌, నవీన్‌కుమార్‌, పాశం సాయికృష్ణయాదవ్‌ తదితరులు డాక్టర్‌ లక్ష్మణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను శాలువాతో సత్కరించి సన్మానించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి


city8.2.jpg

అనంతరం డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తూ పార్టీ పటిష్టతకు పాటుపడాలని నూతన అధ్యక్షులకు సూచించారు. పార్టీలో కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని అన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజవర్గంలోని ఆరు స్థానాల్లో బీపేపీని గెలిపించి, పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు.


city8.3.jpg

డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కలిసిన వారిలో కార్పొరేటర్‌ జి రచనశ్రీ, మాజీ కార్పొరేటర్‌ టి. రవీందర్‌, బీజేపీ నాయకులు జి వెంకటేష్‌, రంగరాజ్‌గౌడ్‌, పరిమళ్‌కుమార్‌, ముషీరాబాద్‌ కన్వీనర్‌ ఎం. రమేష్ రాం, సురేష్‌ ముదిరాజ్‌, ఆర్‌ పద్మ, ఎంసీ మహేందర్‌బాబు, ఏ. ప్రభాకర్‌ గంగపుత్ర, కేశవరాజు. శ్రీనివాస్‌ ముదిరాజ్‌, శివరాజు. బొల్ల రమేష్‌, లింగంగౌడ్‌, మాజీ అధ్యక్షుడు రత్నసాయిచంద్‌ తదితరులున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2025 | 10:23 AM