Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ABN , Publish Date - Jan 30 , 2025 | 06:55 AM
కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా కార్పొరేటర్లకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, మరో ఇద్దరు కార్పొరేటర్లు కలిశారు.

- అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ వివరించండి
- ఏడాది మాత్రమే ఉంది.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి
- మేయర్, కార్పొరేటర్లతో మంత్రులు
- నేడు పొన్నం నివాసంలో కార్పొరేటర్లకు దిశానిర్దేశం
హైదరాబాద్ సిటీ: కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా కార్పొరేటర్లకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి(Hyderabad, Ranga Reddy) జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, మరో ఇద్దరు కార్పొరేటర్లు కలిశారు.
ఈ వార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈ సందర్భంగా మంగళవారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరైన విషయం మంత్రుల దృష్టికి వారు తీసుకెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. అందరినీ పిలిచి దిశానిర్దేశం చేయాలని కోరినట్టు తెలిసింది. దాంతో గురువారం కార్పొరేటర్లతో సమావేశమై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. పొన్నం నివాసంలో ఉదయం 8.30 గంటలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం కౌన్సిల్‌లో వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు చేయనున్నట్టు తెలిసింది. మంత్రులను కలిసిన సందర్భంలో అవిశ్వాసం అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు, అవిశ్వాసం విషయాన్ని కౌన్సిల్‌లో ప్రస్తావించొద్దని మంత్రులు వారికి సూచించినట్టు సమాచారం.
‘చట్ట ప్రకారం అవిశ్వాసం పెట్టడం అంత సులువు కాదు.. ఏ పార్టీకి పూర్తిస్థాయి బలం లేదు.. వారు కలిసినా.. అవిశ్వాసం నెగ్గడం కష్టం. అవిశ్వాస తీర్మానం ఇచ్చినా ఫిబ్రవరి 10 తరువాతే. మనం తొందరపడాల్సిన అవసరం లేదు’ అని దుద్దిళ్ల పేర్కొన్నట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీల సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి దీటైన సమాధానమివ్వాలని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే జీహెచ్‌ఎంసీ(GHMC)కి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుందని, ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఏడాది మాత్రమే గడువు ఉన్న దృష్ట్యా.. డివిజన్లలో సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన నిధులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని పేర్కొన్నట్టు సమాచారం. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కౌన్సిల్‌కు హాజరు కావాలని మంత్రులు సూచించారు.
భారీ బందోబస్తు
సమావేశం దృష్ట్యా.. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని సంబంధిత పోలీస్ అధికారులను కోరిన బల్దియా వర్గాలు.. హైడ్రా సాయమూ తీసుకోవాలని నిర్ణయించాయి. ప్రవేశ ద్వారాల వద్ద బందోబస్తుతోపాటు.. సమావేశ మందిరం వద్ద మార్షల్స్‌ను కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచనున్నారు. కౌన్సిల్‌లో గందరగోళం నెలకొంటే కారకులైన వ్యక్తులను బయటకు పంపించే అవకాశముంది.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News