Home » Gidugu Rudraraju
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ, ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నామన్నారు.
వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ ( AP Congress ) పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు కూడా షర్మిలని పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడే గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు అమలాపురంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారన్నారు.
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం నిర్వహించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఏఐసీసీలో ఏపీలో పరిస్థితులపై కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.00 గంటలకు భేటీ అవుతారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మరికొందరు ఏఐసీసీ పెద్దలు ఏపీ నుంచి హాజరుకానున్నారు.
కార్పొరేషన్ల ముసుగులో సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN ) వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆరోపించారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా అనే అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ...‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరగుతున్న అరాచకాన్ని ఆపలేకపోయింది. రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండగా ఎఫ్ఆర్‌బీఎంను దాటి వెళ్లకూడదని ఎప్పుడు చెప్పేవారు’’ అని గిడుగు రుద్రరాజు తెలిపారు.
Andhrapradesh: వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు.