Share News

AP Congress: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు

ABN , Publish Date - Dec 27 , 2023 | 09:35 AM

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఏఐసీసీలో ఏపీలో పరిస్థితులపై కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.00 గంటలకు భేటీ అవుతారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మరికొందరు ఏఐసీసీ పెద్దలు ఏపీ నుంచి హాజరుకానున్నారు.

AP Congress: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఏఐసీసీలో ఏపీలో పరిస్థితులపై కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.00 గంటలకు భేటీ అవుతారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మరికొందరు ఏఐసీసీ పెద్దలు ఏపీ నుంచి హాజరుకానున్నారు. ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితర ఏపీసీసీ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు.

కాగా వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశముంది. ‘‘మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రెస్‌తో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తున్నాం’’ అని ఒక కాంగ్రెస్‌ నేత అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్కం ఠాగూర్‌కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌కు అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రెస్‌లో చేరతారని వారు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లుతారని భావిస్తున్నారు.

Updated Date - Dec 27 , 2023 | 09:39 AM