Share News

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:17 PM

వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్‌ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ: వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్‌ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

షర్మిల అందుకే కాంగ్రెస్‌లో చేరారు

‘‘షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనేది అధిష్ఠాన నిర్ణయం. పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సంస్థ గతంగా పార్టీని బలోపేతం చేసినందుకు త్వరలో ఇన్‌చార్జితో రాష్ట్రంలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిలతో సహా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం టీంగా పని చేస్తాం‌‌. హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. పార్టీ కోసం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏపీలో జగన్మోహన్‌రెడ్డిని కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించడమే మా లక్ష్యం. గాంధీ కుటుంబం త్యాగం ముందు నా త్యాగం లెక్క కాదు. నిబద్ధతగల కార్యకర్తగా పార్టీ కోసం పని చేశాను’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 04:17 PM