Home » Girl Baby
భార్యాభర్తలను విధి వేరు చేసింది. నెలక్రితం ప్రమాదవశాత్తు రొటావేటర్ కిందపడి భర్త మృతి చెందగా, అప్పటికే గర్భిణిగా ఉన్న భార్య వారం క్రితం ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
Telangana: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు తమముందు ఎంతో ఆనందంగా ఉన్న వారు హఠాత్తుగా మరణిస్తుంటారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్న ఓ చిన్నారి.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
మీరు మీ పాప పెళ్లి(girl) కోసం మంచి గ్యారంటీ ఉన్న పెట్టుబడి స్కీం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ప్రభుత్వం నిర్వహించే సుకన్య సమృద్ధి యోజనలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీం వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ ద్వారా పరిచయమైన బాలికను గంజాయి మత్తులోకి దింపిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం బయటపడింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.
మంచి చదువు చెప్పిస్తూ.. చక్కని భవిష్యత్తు కోసం ఆకాంక్షించే కన్నతండ్రి మనసులో తన పట్ల ‘దారుణమైన ఆలోచన’ ఉందని ఏ కూతురు ఊహిస్తుంది? ఆప్యాయంగా ఎత్తుకోవాల్సిన చేతులే రాకాసి హస్తాలై తన ప్రాణాన్ని బలిగొంటాయని ఏ కూతురు అనుకుంటుంది? పాపం పదమూడేళ్ల ఆ చిట్టితల్లి... ‘వంట కోసం కట్టెలు తెద్దాం..
హైదరాబాద్ మియాపూర్లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్-కాట్నపల్లి మధ్య రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది.
హైదరాబాద్: కొత్త రకం మోసం హైదరాబాద్లో వెలుగుచూసింది. పబ్ యజమానులే కొంతమంది యువతులతో కలిసి డేటింగ్ యాప్ నిర్వహిస్తూ కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేసేలా పబ్బు యజమానులు యువతులను ఎరవేయడం బయటపడింది.
ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటూ.. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళ పాల్పడిన దారుణమిది.