Pub Scam: అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:01 PM
హైదరాబాద్: కొత్త రకం మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పబ్ యజమానులే కొంతమంది యువతులతో కలిసి డేటింగ్ యాప్ నిర్వహిస్తూ కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేసేలా పబ్బు యజమానులు యువతులను ఎరవేయడం బయటపడింది.
హైదరాబాద్: కొత్త రకం మోసం (New Type Fraud) హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పబ్ (Pub) యజమానులే కొంతమంది యువతులతో కలిసి డేటింగ్ యాప్ (Dating App) నిర్వహిస్తూ కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను (Businessman) బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేసేలా పబ్బు యజమానులు యువతులను ఎరవేయడం బయటపడింది. టిండర్ డేటింగ్ యాప్‌లో (Tinder Dating App) వ్యాపారవేత్త రితికా అనే యువతితో పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయిన రెండో రోజే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ (Hi-Tech City Metro Station) వద్దకు రమ్మని పిలిచింది. ఆమె పిలుపుతో అక్కడికి వెళ్లిన వ్యాపారవేత్త పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్‌లోని (Galleria Mall) మోష్ క్లబ్‌కు (Mosh Club) వెళ్దామని కోరింది.
అమ్మాయి పబ్‌కు వెళ్దామని చెప్పడంతో వ్యాపారవేత్త అంగీకరించాడు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకు వెళ్లిన ఆమె తియ్యని మాటలు చెప్పి.. గంటలోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. తర్వాత రూ. 40,505 బిల్‌ను (Rs. 40,505 bil) వ్యాపారవేత్త చేతిలో పెట్టి చల్లగా జారుకుంది. ఒక్కసారిగా బిల్లును చూసిన వ్యాపారవేత్త షాక్‌కు గురయ్యాడు. రూ. 40 వేల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో షాక్ తిన్నాడు. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్‌ని రితికాకు ఇచ్చి ఉంటారని వ్యాపారవేత్త అనుమానించాడు. తర్వాత ఆ పబ్ గూగుల్ రివ్యూస్ చూడగా అసలు మోసం బయట పడింది.
వ్యాపారవేత్త లాగా మోస పోయిన వేరే యూసర్ రాసిన రివ్యూ చూడగా అసలు మోసం వెలుగుచూసింది. పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసం చేస్తున్నారని వ్యాపారవేత్త గుర్తించాడు. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ యజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు వ్యాపారవేత్త గుర్తించాడు. అమ్మాయిలు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు బిల్లులు చేసి యువకుల చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించాడు. తనకు జరిగిన మోసంపై సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు. పబ్బు యజమానులు కక్కుర్తి పడి అమ్మాయిలతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని గుర్తించాడు. ఒక వేళ డబ్బులు కట్టకపోతే పబ్ యజమానులు బలవంతంగా బాధితులను బెదిరించి డబ్బులు కట్టిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిన్నెల్లి అరాచక సామ్రాజ్యం అంతం..
ఆ ఇద్దరే జగన్‌ను తప్పుదోవ పట్టించారు..
ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు
తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News