Home » God
కృష్ణాష్టమి వేడుకల సం దర్భంగా మండల కేంద్రమైన అమరాపురంలోని దక్షిణ గొల్లహట్టిలో వెల సిన వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని దేవాలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు.
కసాపురం దేవస్థానంలో శ్రావణ మాస నాలుగవ, చివరి మంగళవారం రోజున ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, పరిచారకులు తెల్లవారుజామునే నెట్టి కంటి ఆంజనేయ స్వామి విరాట్టుకు అభిషేకాలు, అలంకారాలు చేశారు. ఆలయంలో హనుమాన చాలీసా, సుందరకాండ పారాయణాలు చేశారు. మధ్యాహ్నం మహా మంగళహారతిని నిర్వహించారు. రాత్రి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను వెండి రథంపై ఉంచి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.
మండలంలోని బొల్లనగుడ్డంలో వెలసిన తోటప్పజ్ఞస్వామి 47వ పూజోత్సవంలో భాగంగా మంగళవారం వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి గంగపూజ, గణపతిపూజ, నవగ్రహ పూజా, పంచామృతాభిషేకం, రుద్రహోమం నిర్వ హించి సాయంత్రం భారీ జనసందోహం మధ్య రథోత్సవాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై స్వామివారికి పూజలు జరిపించి రథాన్ని లాగారు.
పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వా మి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను యాదవులు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. స్వామివారికి బంగారు కవచధారణ చేశారు. ఉత్సవవిగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. వినాయకసర్కిల్ వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంచేపట్టారు.
మండలంలోని కొట్టాలపల్లి వెలసిన రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు. గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త శ్రీనివాసయాదవ్, కమిటీ సభ్యులు గంగరాజు, రఘురాములు, రంగారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాజా, రామాంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల వ్యాప్తంగా సోమవారం కన్నుల పండువగా నిర్వ హించారు. ఆలయాల్లో తెల్లవారు జాము నుంచే అభిషేకాలు, అర్చన లు, అలంకరణ తదితర ప్రత్యేక పూ జలు చేశారు. పలు చోట్ల స్వామి కల్యాణోత్సవాలను నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమా లు చేపట్టారు.
విజయనగరం జిల్లా జామిలో పురాతనమైన రాతి శిలా శాసనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి 900 సంవత్సరాల కిందట తూర్పు గంగ చక్రవర్తి అనంత దేవ వర్మ చెక్కించినవిగా భావిస్తున్నారు.
పట్టణంలో ప్రసిద్ధిచెందిన శనీశ్వరుడి ఆలయా నికి శ్రావణమాస మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4.30కే జరిగిన తొలి పూజ, నవగ్రహ తైలాభిషేకానికి భ క్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు శీతలాంబకు కుంకుమార్చ న చేయించారు. శనీశ్వరుడికి ఇష్టమైన నల్లనువ్వులు, నల్లగుడ్డలు అగ్ని గుండంలో వేసి, ప్రదక్షిణ చేసి శనిమహాత్మా మా జోలికి రావద్దని వేడుకు న్నారు.
పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాల యంలో శనివారం ఉదయం నుంచి శ్రావణమాసం పురస్కరించుకొని ఏడు కొండల స్వామి వ్రతాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య వైభవంగా సాగింది. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉద యం 6 గంటల నుంచి గణపతి పూజ, గంగపూజ, గోపూజా తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని జిల్లేడగుంట గ్రామంలో వెలసిన కంబాల సనసింహస్వామికి గ్రామస్థులు సోమవా రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వా రికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రఽథంపై ఉంచి జిల్లేడగుంట, భక్తరహళ్లి గ్రామాల్లో ఉరేగిం చారు. స్వామివారి రథంతో పాటు భక్తులు జ్యోతులను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్లూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.