LORD : వైభవంగా జ్యోతుల ఉత్సవం
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:03 AM
మండలంలోని దాదులూరు పోతలయ్య స్వామికి భక్తులు జ్యోతులు, బోనాలు సమర్పించి మెక్కు లు తీర్చుకున్నారు. దాదులూరు పరుషలో రెండో రోజైన సోమవారం పోతలయ్య, చెన్నకేశవ స్వామి, బంగారు లింగమయ్య స్వామికి ఫల హారపు బండ్లతో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చు కున్నారు.

కనగానపల్లి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని దాదులూరు పోతలయ్య స్వామికి భక్తులు జ్యోతులు, బోనాలు సమర్పించి మెక్కు లు తీర్చుకున్నారు. దాదులూరు పరుషలో రెండో రోజైన సోమవారం పోతలయ్య, చెన్నకేశవ స్వామి, బంగారు లింగమయ్య స్వామికి ఫల హారపు బండ్లతో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చు కున్నారు. అంతకు ముందు పూజారులు, పోతురాజులు గ్రామ సమీ పంలో జల్దిపూజ నిర్వహించారు. అలాగే మూడో రోజు మంగళవారం గావుల మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పూజారులు తెలిపారు. స్వాములను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతరలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....