GOD : కన్నులపండువగా రథోత్సవం
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:13 AM
మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలో మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు గురువారం బ్రహ్మరథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కల్యాణమండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలో ఉదయం రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలో మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు గురువారం బ్రహ్మరథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కల్యాణమండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలో ఉదయం రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు. అనంతరం మడుగుతేరు లాగారు. గర్భ గుడిలోని కాశీవిశ్వేశ్వర లింగానికి రుద్రా భిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహించారు. సాయంత్రం వి శేషంగా అలంకరించిన రథంలో శివపార్వ తుల ఉత్సవమూర్తులను ఉంచి పురవీధు ల్లో రథాన్ని లాగారు. రథోత్సవం ఎదుట భక్తులు భజనలు చేస్తూ ముందుకు సా గారు. ఆలయ ఆవరణలోని వేదికపై చి న్నారులు సంప్రదాయ నృత్యాలతో అలరిం చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, నరేంద్ర చౌదరి, శ్రీని వాసులు, ఎర్రిస్వామి, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....