GOD : ఘనంగా శివుడికి త్రిశూల స్నానం
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:35 AM
జిల్లాకేంద్రంలో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు శని వారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం కాశీవిశ్వేశ్వరుడికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు త్రిశూలస్నానం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు శని వారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం కాశీవిశ్వేశ్వరుడికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు త్రిశూలస్నానం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే ఆలయ సిబ్బంది, భక్తులు వసంతోత్సవం జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో రుద్రహోమం చేసి, మహా పూర్ణాహుతి సమర్పించారు. తదనంతరం ధ్వజావరోహణ చేశారు. రాత్రి ఆలయంలో శివపార్వతుల ఉత్సవమూర్తులకు శయనోత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, ఽనరేంద్ర చౌదరి, శ్రీనివాసులు, ఎర్రిస్వామి, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....