Home » governor Tamilisai
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
వర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తెలిపారు.
MLC Kodandaram: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే, వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్(Mir Amir Ali Khan)లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సీరియస్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఉద్దేశించి పాడికౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓటర్స్ డే సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ఓటు వెయ్యకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ కామెంట్స్‌పై మండిపడ్డ గవర్నర్.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan) ఎక్స్ అకౌంట్(X) హ్యాక్‌కి గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా మరో నలుగురు సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.
హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు.
Telangana: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు.