Telangana: ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం.. ప్రకటించిన గవర్నర్ కార్యాలయం..
ABN , Publish Date - Jan 25 , 2024 | 03:57 PM
MLC Kodandaram: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే, వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను ఆమోదించారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరి నియామకానికి గవర్నర్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు కోదండరాం సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దీంతో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు పంపించగా.. గవర్నర్ ఆమోదించారు.
కాగా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. అయితే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వీరిద్దరి పేర్లను తిరస్కరించారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గత ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దాంతో దాంతో ఆ రెండు స్థానాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.