Home » Group-1
బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొంతమంది రాజకీయ నేతలు 33,383 మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని అన్నారు.
నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్ఎస్ కుట్ర చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు చూశారని అన్నారు.నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని విమర్శించారు.
Telangana: జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. బండి సంజయ్తో పాటు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున అశోక్నగర్ చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగారు.
Telangana: గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని డీజీపీ జితేందర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈనెల 21 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహిస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఊరట. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న అడ్డంకులను హైకోర్టు తొలగించింది.
Telangana Group 1 Aspirants: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.