Share News

Group-1 Exam: గ్రూప్‌-1లో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల ప్రతిభ

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:03 AM

గ్రూప్‌-1లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన టీజీఆర్టీసీ ఉద్యోగుల పిల్లలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు.

Group-1 Exam: గ్రూప్‌-1లో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల ప్రతిభ

  • అభినందనలు తెలిపిన టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : గ్రూప్‌-1లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన టీజీఆర్టీసీ ఉద్యోగుల పిల్లలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు. నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్‌ శ్రీనివాస్‌ కుమార్తె వీణ(118), ఐటీ-2గా పనిచేస్తున్న వాహిద్‌ కుమార్తె ఫాహిమినా ఫైజ్‌(126), వనపర్తి డిపోలో పనిచేస్తున్న ఐటీ-2 ఎస్‌.బాల్‌రెడ్డి, కండక్టర్‌ పుష్పలత కుమారుడు రాఘవేందర్‌ రెడ్డి(143) ర్యాంకులు సాధించారు.


బస్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ర్యాంకర్లతోపాటు వారి తల్లిదండ్రులను సజ్జనార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్‌-1లో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు రాణించడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 04:03 AM