Group-1 Recruitment: గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:56 AM
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలకు మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

జీవో 29పై పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
గతంలోనే తిరస్కరించామని గుర్తు చేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలకు మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జీవో 29ను రద్దు చేయాలంటూ సూరేపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29ని తీసుకొచ్చిందని పిటిషన్‌లో తెలిపారు.
దీని వల్ల రాష్ట్రంలో వేలాది మందికి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ పి.శ్రీనరసింహ, జస్టిస్ జె.బాగితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే జీవో 29పై గతంలోనే పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధర్మాసనం గుర్తు చేసింది. గ్రూప్-1కు సంబంధించి నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ దశలో అందులో జోక్యం చేసుకోలేమని తెలుపుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News