Share News

Group 1 Candidates: జీవో 29 రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:06 AM

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం కలిగించేలా రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించిన జీవో 29ను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

Group 1 Candidates: జీవో 29 రద్దు చేయాలి

  • తెలంగాణ భవన్‌లో గ్రూప్‌ 1 అభ్యర్థుల నిరసన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం కలిగించేలా రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించిన జీవో 29ను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. జీవో 29ను రద్దు చేయాలని తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గ్రూప్‌ 1 అభ్యర్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రూప్‌ 1 నియామకాల్లో జీవో 54ను రద్దు చేసి జీవో 29ను అమలు చేసి అగ్రవర్ణ విద్యార్థులకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 04:06 AM