Home » Gudivada
ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు గోసపడుతున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని వాపోతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యోగాలిస్తే.. ప్రజా సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గుడివాడలో గడ్డం గ్యాంగ్కు ప్రజలు జలక్ ఇచ్చారు. కొడాలి నాని (Kodali Nani) అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్లో రూ.100కోట్ల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు.
కరోనా సమయంలో మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) అండతో గడ్డం గ్యాంగ్ (Kodali Gaddam Gang) చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. దొరికిన చోటల్లా ..
తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.
గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పిన ఓ మాయలేడి కోటిన్నర వరకు దోచుకుంది. ఖతర్నాక్ లీలావతి చేతిలో మోసపోయిన బాధితులు తమను ఆదుకోవాలంటూ గుడివాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్లు నడుస్తున్నాయి.
అవును.. మీరు వింటున్నది నిజమే మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పోలింగ్ తర్వాత తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే.. ఎన్నికల్లో (AP Elections) ఓటర్లకు పంచాల్సిన డబ్బులు కొందరు నాని మనుషులు కాజేశారన్నది.. ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంతో కొడాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..