Kodali Nani :వెలుగులోకి కొడాలి నాని ఆక్రమాలు..
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:35 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Former minister Kodali Nani) వరుస షాక్‌లు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో తాజాగా కొడాలి నానికు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొడాలి నాని మరో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది.
కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Former minister Kodali Nani) వరుస షాక్‌లు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో తాజాగా కొడాలి నానికు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొడాలి నాని మరో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది. గడ్డం గ్యాంగ్ భూకబ్జాలపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. తవ్విన కొద్ది కొడాలి నాని గ్యాంగ్ అక్రమాలు బయటికి వస్తున్నాయి. కొడాలి నాని ప్రధాన అనుచరుడు కొల్లి విజయ్ బైపాస్ రోడ్డులో ఓ ఖరీదైన అక్షర పాఠశాల స్థలాన్ని బెదిరించి తక్కువ రేటుకు కాజేసిన సంఘటనలో కోర్టును పాత యజమాన్యం ఆశ్రయించింది.
టీచర్స్ కాలనీలో సుమారు రూ.8 కోట్ల విలువైన అక్షర పాఠశాల స్థలాన్ని అప్పడు మంత్రిగా ఉన్న కొడాలి నాని మద్దతుతో బెదిరించి కొల్లి విజయ్ స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో కొడాలి నాని ఆయన అనుచరుల కబ్జాలో ఉన్న ఆస్తులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హక్కుదారులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే చర్యలు చేపట్టడంతో అక్షర పాఠశాల పాత యజమాన్యం ఆ స్థలం కోసం ముందుకు వచ్చారు. తమ ఆస్తులను బెదిరించి కబ్జా చేశారని అక్షర స్కూల్ పాత యజమాన్యం కోర్టును ఆశ్రయించింది.
ALSO Read: YS Sharmila: ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్లు
పాఠశాల ఆస్తుల కబ్జాపై విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే శరత్ టాకీస్‌ను కొడాలి నాని ఆక్రమించుకోగా దానిని ఎమ్మెల్యే రాము అండతో యాజమాన్యం స్వాదీనం చేసుకున్నారు. బైపాస్ రోడ్డు లో విద్యావికాస్ వద్ద 7.66 ఎకరాల చైతన్య హోసింగ్ కాలనీ స్థలాన్ని ఆక్రమించుకోగా గెలిచిన 24 గంటల్లో అసలు ఫ్లాట్ల యజమానులకు ఎమ్మెల్యే రాము అప్పగించారు.
ఐదేళ్లుగా కొడాలి నాని గ్యాంగ్ ఆక్రమణలో ఉన్న ఆస్తులను అసలు హక్కుదారులకు అప్పగించడంలో ఎమ్మెల్యే రాము చేస్తున్న కృషిని ముక్తకంఠంతో గుడివాడ ప్రజానీకం అభినందిస్తున్నారు. కొడాలి నాని ఆయన గ్యాంగ్ చేసిన భూ కబ్జాలు, సెటిల్మెంట్లు తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే కొడాలి నాని మీద ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి. నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన
Nitin Gadkari: ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి సమీక్ష..
Read Latest AP News And Telugu News