Home » Gujarat
గుజరాత్‌లోని రాజ్‌కోట్(Rajkot) నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఒకానొక కీలక సందర్భంలో నియోజకవర్గ ఓటర్లు వెన్నంటే నిలవటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభ రేసులో ఉన్న గోవింద్ ధోలకియా, డాక్టర్ జస్వంత్‌సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మార్, మయాంక్ నాయక్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రాజ్‌కోట్ మూడో టెస్టు రెండో రోజు కూడా ముగిసింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న సిరీస్ మూడో మ్యాచ్ రెండో రోజు చివరి సెషన్లో బెన్ డకెట్ సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
గుజరాత్‌కు చెందిన గీత అనే వివాహిత కోల్ కతాలో 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ కోమాలో ఉన్న గీతకు ఇటీవల సృహ వచ్చింది. తన కుటుంబం వివరాలు చెప్పడంతో అధికారులు వీడియో కాల్ మాట్లాడించారు. గీతతో మాట్లాడటంతో ఆ కుటుంబ సభ్యులు తెగ సంబర పడిపోయారు.
స్వామి దయానంద సరస్వతి(Swami Dayanand Saraswati) రాకతో బ్రిటిషర్ల కుట్రలు బట్టబయలయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు దయానంద 200వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా టంకరాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
Farmer: అతనేమీ సైంటిస్ట్ కాదు.. పీజీలు చేసి పట్టాలు పొందలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ చేయడం లేదు. అలాగమని ఏ కంపెనీకి యజమాని కూడా కాదు. ఓ సామాన్య రైతు. చదవింది 8వ తరగతే కానీ.. సంవత్సరానికి 1.5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఈ రైతు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాడు. మరి రైతు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..
అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఆ రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు.
గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ(Ram Mandir) కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాబోదనే అధిష్టాన నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా(MLA Resign) చేశారు. విజాపూర్ నియోజకవర్గం నుంచి సీజే చావ్డా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. టీచర్లు, విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరకు(Vadodara) చెందిన ఓ ప్రైవేటు స్కూలు టీచర్ల బృందం విద్యార్థులతో కలిసి హరణి సరస్సు వద్దకు వచ్చారు.