Home » Hardik Pandya
ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం మరో ఇద్దరు ఆల్ రౌండర్ల కోసం బీసీసీఐ గాలిస్తోంది. వీరిలో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో పాటు మరో తెలుగు తేజం పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా 39 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడిన పలు షాట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే పాండ్యా భార్య నటాషా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన నాలుగేళ్ల కుమారుడు అగస్త్యను మొదటిసారి కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా స్టా్ర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిచ్ ఇటివల అధికారికంగా విడిపోయారు. ఆ తర్వాత నటాషా మరో వ్యక్తితో కనిపించడంతో అనేక మంది ఆమెపై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బ్రిటీష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా(Jasmin Walia)తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి గత నెలలో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరొకరితో ప్రేమలో పడ్డాడా? ప్రస్తుతం ఆమెతోనే డేటింగ్ చేస్తున్నాడా? బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా?
విడిపోయినప్పటికీ హార్ధిక్ పాండ్యా- నటాషా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏదో అంశం గురించి ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నటాషాకు సంబంధించి హార్ధిక్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. నటాషా ఇష్ట ఇష్టాలకు సంబంధించి రాసుకొచ్చారు. ఆ దంపతులు విడిపోయేందుకు కారణం ఇది అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీ20ల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా ఉంటాడని అంతా అనుకుంటే.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను రంగంలోకి..
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా ఏళ్ల నుంచి ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పాండ్యా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేడు. అందుకే చాలా త్వరగానే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), నటి నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic) పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఇటివల విడిపోయారు. ఆ క్రమంలో నటాషా తన కొడుకుతో ఉన్న కొన్ని ప్రత్యేక చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. అవి చూసిన హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో స్పందించారు.