Home » Haryana
రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రవి మృతికి సంబంధించిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియ పరిచింది.
ఈ ఏడాదిలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే వెల్లడించింది. మొత్తం 90 స్థానాల్లో.. 44% ఓట్లతో కాంగ్రెస్ 43-48 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆ సర్వే తెలిపింది.
డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఆరోగ్య సేవలు నిలిపేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేయాలని హరియాణా వైద్యులు నిర్ణయించారు. ఇవాళ(జూలై 25న) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవల బంద్‌కు హర్యానా సివిల్ మెడికల్ సర్వీసెస్ (HCMS) అసోసియేషన్ బుధవారం పిలుపునిచ్చింది.
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
హర్యానాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో భాగంగా నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...
అగ్నిపథ్ పథకంపై(Agnipath Scheme) కేంద్రం, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు(Agniveer) పోలీసు, మైనింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు.
హర్యానా, పంజాబ్‌లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో కానీ, రామ్‌లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మంగళవారం తెలిపారు.
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ స్కై డైవింగ్ చేశారు. ‘ప్రపంచ స్కై డైవింగ్ డే’ సందర్భంగా శనివారం ఆయన ఈ అరుదైన సాహసం చేశారు.
స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం హర్యానా(Haryana)లోని పంచకుల(Panchkula)లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
రెడ్ సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఆ క్రమంలో కాగితాలు చూపించాలంటూ ట్రాఫిక్ పోలీస్.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.