Accident: స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:50 AM
స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం హర్యానా(Haryana)లోని పంచకుల(Panchkula)లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం హర్యానా(Haryana)లోని పంచకుల(Panchkula)లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. అదే సమయంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. గాయపడిన వారందరినీ పింజోర్ ఆసుపత్రి, పంచకుల సెక్టార్ 6 సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వారంతా చికిత్స పొందుతున్నారు. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున, ఆమెను చండీగఢ్ పీజీఐకి రిఫర్ చేశారు.
పింజోర్‌లోని నౌలత గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంతో బస్సు(bus) నడపడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. అదే సమయంలో బస్సులో విద్యార్థులు పరిమితికి మించి ఉన్నారని మరికొంత మంది అంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతోపాటు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంపై పంచకులలోని కల్కా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి స్పందించారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
హర్యానాలో ఇలాంటి ఘటన గత వారం కూడా ఒకటి జరిగింది. కుండ్లీ-మనేసర్-పల్వాల్ (KMP) ఎక్స్‌ప్రెస్‌వేపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కూడా అతివేగం వల్లే జరిగింది. వేగంగా వెళ్తున్న ఎర్టిగా కారు ముందు వెళ్తున్న క్యాంటర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే వాహనం బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది కూడా చదవండి:
Rains: 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. మరో 11 రాష్ట్రాలకు అలర్ట్
చార్‌ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
Read Latest National News and Telugu News