Farmers protest: మళ్లీ ఢిల్లీకి రైతుల ర్యాలీ.. ఉద్యమం ఆగదని ప్రకటించిన బీకేయూ
ABN , Publish Date - Jul 16 , 2024 | 05:35 PM
హర్యానా, పంజాబ్‌లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో కానీ, రామ్‌లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మంగళవారం తెలిపారు.
ఛండీగఢ్: హర్యానా, పంజాబ్‌లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో కానీ, రామ్‌లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ (Jagjeet singh Dallewall) మంగళవారం తెలిపారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర (MSP) హామీ ఇవ్వడంతో సహా పలు డిమాండ్లపై రైతులు గత కొన్నాళ్లుగా నిరసలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గత ఫిబ్రవరిలో చేపట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో అప్పటి నుంచి హర్యానా సరిహద్దుల్లోనే రైతులు బస చేస్తున్నారు. ఘర్షణల క్రమంలో శింబు సరిహద్దు వద్ద అధికారులు రోడ్లు మూసివేసి రాకపోకలను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలిగించవద్దని పేర్కొంది. అయితే, శాంతిభద్రతల పరిస్థితిని ఉటంకిస్తూ కోర్టు ఆదేశాలపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Rahul Gandhi: దోడా ఎన్‌కౌంటర్‌పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
మళ్లీ ఆపితే ప్రభుత్వానిదే బాధ్యత..
కాగా, ఈసారి తమను అడ్డుకున్నా, రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసిన హర్యానా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జగ్జీత్ సింగ్ దలేవాల్ తెలిపారు. రైతు నిరసనలపై గత మార్చిలో అరెస్టు చేసిన నవదీప్‌సింగ్‌కు సంఘీబావంగా బుధవారంనాడు శాంతియుత నిరసన తెలుపుతామని చెప్పారు. ఫిబ్రవరిలో రైతులు, భద్రతా బలగాలకు మధ్య తలెత్తిన ఘర్షణల్లో బటిండాకు చెందిన 21 ఏళ్ల యువరైతు సుభ్‌కరణ్ సింగ్ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరి వద్ద ప్రాణాలు కోల్పోయాడు.
For Latest News and National News click here